జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులు

ABN , First Publish Date - 2022-09-24T05:58:28+05:30 IST

భువనగిరిలోని శ్రీ నవభారత డిగ్రీ, పీజీ కళాశాలలో టాస్క్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌ మేళాలో 58 మందికి ఉద్యోగాలు లభించాయి.

జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులు

జాబ్‌ మేళాలో 58 మందికి ఉద్యోగాలు 

భువనగిరి టౌన, సెప్టెంబరు 23: భువనగిరిలోని శ్రీ నవభారత డిగ్రీ, పీజీ కళాశాలలో టాస్క్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌ మేళాలో 58 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రతిభ ఆధారంగా జస్ట్‌ డయల్‌, టెక్‌ ఔట్‌, హెచడిఎ్‌ఫసీ, ఎస్‌బిఐ, ఏసీటీ ఫైబర్‌, రాయల్‌ సుందరం, హ్యాపీ మొబైల్‌, కనెక్ట్‌ బిజినెస్‌ సొల్యూషన్స, ప్రతినిధులు తమ సంస్థల్లో ఉద్యోగాల కోసం 58 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ.ప్రభాకర్‌గౌడ్‌ ప్రారంభించిన జాబ్‌  మేళాలో ఆయా సంస్థల ప్రతినిధులు, లెక్చరర్స్‌ పాల్గొన్నారు. 


Read more