ప్రశాంతంగా నీట్‌

ABN , First Publish Date - 2022-07-18T06:40:24+05:30 IST

వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా నీట్‌

హాల్‌టికెట్లలో అడ్రస్‌ సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు

సూర్యాపేట సెంటర్‌కు వెళ్లాల్సిన  వారు నల్లగొండకు రాక

8 2,385 మందికి 2,305 హాజరు

నల్లగొండ, జూలై 17: వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే హాల్‌టికెట్లలో అడ్రస్‌ సరిగా లేకపోవడంతో ఏడుగురు, ఆలస్యం గా రావడంతో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. నల్లగొండ పట్టణంలో నాలుగు కేంద్రాల్లో 1,440మంది విద్యార్థులకు 1,401 మంది పరీక్షకు హాజరుకాగా, 39 మంది గైర్హాజరయ్యా రు. సూర్యాపేటలో నాలుగు కేంద్రాల్లో 945మంది విద్యార్థులకు 904 మంది హాజరుకాగా, 41 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20వరకు పరీక్ష కొనసాగింది. కాగా, పలువురి హాల్‌టికెట్లలో దురాజ్‌పల్లి, నియర్‌ కలెక్టరేట్‌, నల్లగొండ అని ఉండటంతో వీరు నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో కలెక్టరేట్‌కు కొద్ది దూరంలో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి చేరుకున్నారు. అయితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించే సమయంలో హాల్‌ టికెట్లను పరిశీలించిన సిబ్బం ది సూర్యాపేటకు వెళ్లాలని సూచించారు. అప్పటికే సమ యం మించిపోవడంతో వారంతా సూర్యాపేటకు వెళ్లే సమయం లేక పరీక్ష రాయలేకపోయారు. నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన రవి పరీక్షకు బయల్దేరిన సమయంలో మొదట బైక్‌ చైన్‌ పడిపోయిం ది. దాన్ని సరిచేసుకుని పరీక్ష కేంద్రానికి బయల్దేరగా బైక్‌ పంచర్‌ కావడంతో ఆలస్యమై ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. అదేవిధంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి వచ్చిన దుర్గా అనే విద్యార్థిని ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. అయితే 20 నిమిషాల ముందే వచ్చానని ఆ విద్యార్థిని వాపోయింది. ఖమ్మం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో పాటు రోడ్ల బాలేకపోవడంతో ఆదివారం ఉదయం 5గంటలకు బయల్దేరి నల్లగొండకు వచ్చానని, అయినా తనను పరీక్షకు అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద అడ్రస్‌ వివరాలు సరిగా లేకపోవడంతో ఏడుగురు విద్యార్థులు, ఆసల్యంగా వచ్చిన ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. అడ్రస్‌ సరిగా లేకపోవడంపై నీట్‌ కోఆర్డినేటర్‌ పార్థసారథి స్పందిస్తూ ఎనిమిది రోజుల క్రితమే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను పొందుపర్చామని, వాటిని పరిశీలించుకుని పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థులు పొరపడి ఉండవచ్చని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఎన్‌హెచ్‌-65, దురాజ్‌పల్లి, నియర్‌ కలెక్టరేట్‌ అని స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

ప్రశ్నలు థియరీ మోడల్‌లో ఉన్నాయి

నీట్‌ పరీక్ష బాగానే రాశా. జువాల జీ పేపరులో ప్రశ్నలు థియరీ మో డల్‌లో పెద్దగా ఇచ్చారు. సమాధానాలు సైతం అలాగే ఇవ్వాల్సి ఉం ది. దీంతో ఇబ్బంది ఎదురైంది. మిగ తా సబ్జెక్టులన్నీ మామూలుగానే ఉన్నాయి. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి.

- కె.ప్రీతి, చండూరు

ప్రశ్నపత్రం సులువుగా ఉంది

నీట్‌ ప్రశ్నపత్రం సులువుగా వచ్చింది. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. పరీక్ష బాగానే రాశా. సబ్జెక్టులకు సంబంధించి చదివిన విధంగానే ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా ప్రశ్నపత్రం సులభంగానే ఉంది.

- సీహెచ్‌.రాకే్‌ష, నల్లగొండ





చింతపల్లి మండలానికి చెందిన ఈ విద్యార్థి పేరు సంధ్య. ఈమె హాల్‌ టికెట్‌లో కూడా దురాజ్‌పల్లి, నియర్‌ కలెక్టరేట్‌, నల్లగొండ అని అడ్రస్‌ ఉంది. దీంతో ఆమె కూడా నల్లగొండలోనే పరీక్ష ఉంటుందని ఇక్కడి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లింది. అక్కడి సిబ్బంది హాల్‌ టికెట్‌ను పరిశీలించి సూర్యాపేటలోని దురాజ్‌పల్లిలో పరీక్ష కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అప్పటికే సమయం మించపోవడంతో ఆమె సూర్యాపేటకు వెళ్లలేక, పరీక్ష రాయలేక కన్నీరు పెట్టుకుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వైఫల్యం కారణంగా విద్యా సంవత్సరం కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.



 ఈ విద్యార్థిని పేరు బుర్రి మానస. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మా ని గ్రామానికి చెందిన ఈమె సూర్యాపేట జిల్లాలో నీట్‌ పరీక్ష రాయాల్సి ఉంది. కాగా, ఆమెకు వచ్చిన హాల్‌టికెట్‌లో దురాజ్‌పల్లి, నియర్‌ కలెక్టరేట్‌, నల్లగొండ అని అడ్ర స్‌ ఉంది. దీంతో ఆమె నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో కలెక్టరేట్‌కు కొద్ది దూరంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం వద్దకు చేరుకుంది. హాల్‌టికెట్‌ను పరిశీలించిన అక్కడి సిబ్బంది సూర్యాపేటకు వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే అప్పటికే సమ యం మించిపోవడంతో ఆమె సూర్యాపేట వెళ్లలేకపోయిం ది. దీంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవా ల్సి రావడంతో ఆ విద్యార్థిని కన్నీటి పర్యంతమైంది.

Updated Date - 2022-07-18T06:40:24+05:30 IST