సమాజాన్ని సంస్కరించిన వ్యక్తి సేవాలాల్‌

ABN , First Publish Date - 2022-02-16T06:46:50+05:30 IST

సమాజాన్ని సంస్కరించిన వ్యక్తి సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని బంజారాభవన్‌లో మం గళవారం నిర్వహించిన సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో మాట్లాడారు. గిరిజన జాతిని మేల్కొల్పడంలో సేవాలాల్‌ కృషి ఎనలేనిదన్నారు.

సమాజాన్ని సంస్కరించిన వ్యక్తి సేవాలాల్‌
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, ఫిబ్రవరి15: సమాజాన్ని సంస్కరించిన వ్యక్తి సంత్‌ సేవాలాల్‌  మహరాజ్‌ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని బంజారాభవన్‌లో మం గళవారం నిర్వహించిన సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో మాట్లాడారు. గిరిజన జాతిని మేల్కొల్పడంలో సేవాలాల్‌ కృషి ఎనలేనిదన్నారు. తండాలు కూడా అబివృద్ధి చెందాలని కలలు కన్న సేవాలాల్‌ ఆశయాలను సీఎం సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని తెలిపారు. జిల్లాకేంద్రంలో బంజార భవనాలకు స్థల కేటాయింపుతో పాటు రూ.2కోట్లు కేటాయిస్తామని తెలి పారు. అనంతరం బోగ్‌బండార్‌ పూజలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీవైస్‌ చైర్మ న్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, సుధా బ్యాంక్‌ చైర్మన్‌ మీలా మహదేవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more