‘గండి’ పూడ్చివేత పనులు వేగవంతం

ABN , First Publish Date - 2022-09-13T05:44:14+05:30 IST

మండలంలోని ముప్పారం-వేంపాడ్‌ గ్రామాల మధ్య నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్‌ వద్ద పడిన గండి మరమ్మతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

‘గండి’ పూడ్చివేత పనులు వేగవంతం
పనులు పరిశీలిస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

నిడమనూరు, సెప్టెంబరు 12: మండలంలోని ముప్పారం-వేంపాడ్‌ గ్రామాల మధ్య నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్‌ వద్ద పడిన గండి మరమ్మతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాల్వలో ఉన్న నీటిని మళ్లిచేందుకు 112 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లతో నీటిని నిరంతరాయంగా బయటకు తోడేస్తున్నారు.దీంతో పాటు గండి పడిన ప్రాంతంలో మట్టి పనులు కూడా సోమవారం మొదలు పెట్టారు. కాల్వలో ఉన్న నీటి నిల్వ తగ్గుముఖం పట్టడంతో గండి ప్రదేశంలోని శిథిలాలను యంత్రాలతో తొలగిస్తున్నారు. కాల్వకట్టకు 60మీటర్ల పొడవు, 32మీటర్ల వెడల్పు తో గండి పడినట్లు అధికారులు తెలిపారు. కాల్వకు పడిన గండిని త్వరితగతిన పూడ్చివేసి సాగునీటిని సరఫరా చేసేందుకు ఎన్‌ఎస్పీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పనులు మరింత వేగవంతం చేశారు. ఆయకట్టులో పంటలు సాగు చేసిన రైతులకు సా గునీటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన గండి పూడ్చివేసి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారు లు వివరించారు.ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీకాంతరావు,ఎస్‌ఈ ధర్మా పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. డీఈలు సంపత్‌, శివరా త్రి శ్రీనివాస్‌, ఏఈ స్వయంప్రకా్‌షరెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు.


వంతెన నిర్మించాలని లోతట్టు ప్రాంత వాసుల ఆందోళన

నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతా లు ముంపు బారిన పడకుండా వంతెన నిర్మించాలని డిమాండ్‌ చే స్తూ ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. కోదాడ-జడ్చర్ల జాతీ య రహదారిపై నిడమనూరు సమీపంలో వైకుంఠధామం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి రోడ్డు పనులు నిలిపివేయాలని డిమాండ్‌ చే స్తూ సోమవారం నినాదాలు చేశారు. జాతీయ రహదారినిర్మాణం తర్వాతే లోతట్టు ప్రాంతాలకు మరిం త ముంపు గండం ఎక్కువైందని వాపోయారు. ఎస్‌ఏ శోభన్‌భాబు అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సాయినగర్‌ వరద బాధితులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సహ కారంతో ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం 20 కిలోల బియ్యం, రూ.వెయ్యి నగదు చొప్పున పంపిణీ చేశారు. 

Updated Date - 2022-09-13T05:44:14+05:30 IST