బంపర్‌ ఆఫర్‌ అన్నారు.. బతుకమ్మచీర పంపారు

ABN , First Publish Date - 2022-02-23T05:39:51+05:30 IST

బంపర్‌ ఆఫర్‌ అని చెప్పి డబ్బులు కట్టించి బతుకమ్మ చీరను పంపారు. ఈ ఘటన రాజాపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది.

బంపర్‌ ఆఫర్‌ అన్నారు.. బతుకమ్మచీర పంపారు
పోస్టులో వచ్చిన బతుకమ్మ చీరను చూపుతున్న వెంకటేష్‌

రాజాపేట, ఫిబ్రవరి 22: బంపర్‌ ఆఫర్‌ అని చెప్పి డబ్బులు కట్టించి బతుకమ్మ చీరను పంపారు. ఈ ఘటన రాజాపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లింగాల వెంకటేష్‌కు వారం రోజుల క్రితం 7093492081 నెంబరు నుంచి ఫోన్‌ చేసి మీకు బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని తెలిపారు. ముక్కు పుడక, బంగారు చైన్‌, పట్టుచీర ఆఫర్‌గా ఉన్నాయని రూ.1200 చెల్లించాలని కోరారు. దీంతో వెంకటేష్‌ సరే పంపండి అని చెప్పడంతో, మంగళవారం రాజాపేట పోస్టాఫీస్‌కు పోస్ట్‌లో పార్శిల్‌ వచ్చిందని ఫోన్‌చేశారు. ఆయన పోస్ట్‌ ఆఫీ్‌సకు వెళ్లి రూ.1200తోపాటు పోస్టల్‌ చార్జీలు చెల్లించారు. పార్శిల్‌ కవర్‌ తీసుకొని ఇంటికి వచ్చి తెరిచి చూడగా, అందులో బతుకమ్మ చీర మాత్రమే ఉంది. వెంటనే ఫోన్‌చేసిన సెంబర్‌కు కాల్‌ చేయగా, లిఫ్ట్‌ చేయడం లేదని, దీంతో మోసపోయానని గ్రహించి ఆందోళన వ్యక్తం చేశాడు. 

 

Read more