బుల్లెట్‌ వాహనంచోరీ

ABN , First Publish Date - 2022-05-18T07:02:07+05:30 IST

మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గల యాదవ అన్నదాన సత్రం వద్ద ఉంచిన బుల్లెట్‌ వాహనం(రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌) చోరీకి గురైంది.

బుల్లెట్‌ వాహనంచోరీ

మఠంపల్లి, మే 17: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గల యాదవ అన్నదాన సత్రం వద్ద ఉంచిన బుల్లెట్‌ వాహనం(రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌) చోరీకి గురైంది. ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెదవీడు గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్‌ మొగిలి మట్టపల్లియాదవ్‌ మట్టపల్లి క్షేత్రంలో ఉత్సవాల సందర్భంగా  భక్తులకు అన్నదాన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా, యాదవ సత్రం ఎదుట పార్క్‌ చేసి ఉన్న బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితుడి  ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Read more