కేంద్రానికి బుద్ధి చెప్పాలి: పిడమర్తి రవి

ABN , First Publish Date - 2022-06-11T06:29:20+05:30 IST

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా తొక్కిపెడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని మా

కేంద్రానికి బుద్ధి చెప్పాలి: పిడమర్తి రవి
విలేకరులతో మాట్లాడుతున్న రవి

కేతేపల్లి, జూన్‌ 10: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా తొక్కిపెడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా కేంద్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం లేదన్నారు. దీంతో ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు దక్కాల్సిన 12శాతం రిజర్వేషన్‌ కేంద్ర ప్రభుత్వం దక్కకుండా చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో నవ నిర్మాణ సమితి అధ్యక్షుడు దేవరకొండ నరేష్‌, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మీసాల మహేష్‌, గుర్రం కోటేశ్వర్‌, మాచర్ల వేణు, రాంబాబు, అనిల్‌, సురేష్‌, అంబేడ్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T06:29:20+05:30 IST