బుద్ధి ప్రసాదించవయ్యా సిద్ధి గణపయ్యా

ABN , First Publish Date - 2022-08-31T06:04:59+05:30 IST

ఏ కార్యమైనా విఘ్నాలు కలగకుండా పూర్తికావాలని తొలుత వినాయకుడిని పూజిస్తారు. అదేవిధంగా గణనాథుడిని సద్గుణాల దేవుడిగా ఆరాధిస్తారు. సిద్ధి గణపయ్యను పూజించడం వల్ల సాధకుడికి మంచి బుద్ధి బలం వస్తుందని నమ్ముతారు.

బుద్ధి ప్రసాదించవయ్యా సిద్ధి గణపయ్యా
చౌటుప్పల్‌లో సిద్ధమైన గణనాథుడి మండపం

భూదాన్‌పోచంపల్లి: ఏ కార్యమైనా విఘ్నాలు కలగకుండా పూర్తికావాలని తొలుత వినాయకుడిని పూజిస్తారు. అదేవిధంగా గణనాథుడిని సద్గుణాల దేవుడిగా ఆరాధిస్తారు. సిద్ధి గణపయ్యను పూజించడం వల్ల సాధకుడికి మంచి బుద్ధి బలం వస్తుందని నమ్ముతారు. అందుకే నేటి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే బుద్ధిని పాలకులకు కలిగించాలని, అలాగే ప్రజలు కూడా మంచి సంకల్పంతో ముందుకు సాగేలా శక్తిని ప్రసాదించాలని  వినాయక చవితి సందర్భంగా సిద్ధి  గణపయ్యను వేడుకుందాం.



వినాయక చవితి నాడు గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిదిరోజుల పాటు ఆరాదించడం అనాదిగా వస్తోంది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు లంబోధరుడు, విజ్ఞాధిపతి, గజాననుడు, గణేషుడు, వినాయకుడు ఇలా పలు పేర్లతో భక్తులు పూజిస్తుంటారు. వినాయకుడిని సర్వ శక్తివంతుడిగా, జ్ఞానానికి అధిపతిగా పరిగణిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల ఇతి బాధలన్నీ తొలగుతాయని, ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు పూర్తవుతాయని విశ్వసిస్తారు. గణేషుడిని పూజించడం వల్ల అహంకారం, కోపం, ప్రతికూలతలు తొలగి సమస్యలు సమసిపోతాయని నమ్మకం.


పాలకులకు బుద్ధినివ్వు..

ప్రజలు నిత్యం పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్ర ధానంగా యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి ఉద్యోగ నియామకాలు కల్పించాల్సి ఉంది. విద్య,ఉద్యోగ, కార్మికులకు ఉద్యోగ భద్రత, పదోన్నతులు, బదిలీల సమస్యల నుంచి విముక్తి చేయాల్సి ఉంది. నిత్యావసర వస్తువుల ధరల మోతతో ప్రజలపై పెనుభారం పడుతోంది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జీవనదిగా ఉన్న మూసీ నేడు కాలుష్య కాసారంగా మారి జీవచ్ఛవాలుగా మారుస్తోంది.ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించేలా,మూసీ నదిని ప్రక్షాళించేలా పాలకులకు బుద్ధి ప్రసాదించు వినాయకా... అదేవిధంగా కాలుష్యానికి కారకులు కాకుండా, పర్యావరణ హితులుగా వ్యవహరించేలా ప్రజలకు బుద్ధినివ్వు..


విగ్రహాల ధరలు పెరిగాయ్‌

పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, పెట్రో ధరల తో సతమతమవుతున్న భక్తులకు గణేష్‌ విగ్రహాలు, అలంకరణ సామగ్రి ధరలు కూడా తోడయ్యాయి. విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్లమట్టి, రంగులు, ఇనుపచువ్వలు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ), కలప తదితర సామగ్రి ధరలు 25-30శాతం పెరిగాయి. విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల వేతనాలు పెరగడంతో ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు. విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు కర్రలు, ప్లాస్టిక్‌ పేపర్లు, తాడిపత్రి, థర్మాకోల్‌, రంగురంగుల కాగితాలు, విద్యుత్‌ దీపాలు, లేజర్‌ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామగ్రి ధరలు 10-20శాతం పెరిగాయి. అదేవిధంగా పూజా సామగ్రి ధరలు సైతం విపరీతంగా పెరిగాయి.


గణనాథుడిపై జీఎస్టీ ప్రభావం

బొజ్జ గణపయ్య తొమ్మిదిరోజుల పాటు పూజలందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. కాగా, ద్రవ్యోల్భణ ప్రభావం పండుగలపై స్పష్టంగా కనిపిస్తోంది. జీఎస్టీ పెంపుతో గణేష్‌ విగ్రహాల ధరలు 40శాతం పెరిగాయి. మట్టితో చేసిన ఒక అడుగు విగ్రహం ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ఉంది. రెండున్నర అడుగుల విగ్రహం రూ.4000-రూ.5000 వరకు అమ్ముడవుతోంది. నాలుగు అడుగుల విగ్రహాలు రూ.6000 నుంచి రూ.8000, ఆరు అడుగుల విగ్రహాలు రూ.10వేలకు విక్రయిస్తున్నారు. విగ్రహాల తయారీపై ఇప్పటి వరకు ఉన్న 12శాతం జీఎస్టీని గత నెల 17న జీఎస్టీ కౌన్సిల్‌ 18శాతానికి పెంచింది. కరోనాకు ముందు గణేష్‌ విగ్రహం ధర అడుగుకు రూ.500 నుంచి రూ.700 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.800 నుంచి రూ.1200 వరకు పెరిగింది. దీంతో విగ్రహాల ఏర్పాటు, పూజల నిర్వహణ భక్తులకు భారంగా పరిణమించింది.


ముస్తాబైన గణేష్‌ మండపాలు

భువనగిరి టౌన్‌: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు జిల్లా ము స్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభంకానున్న నవరాత్రోత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు ఫీట్ల నుంచి 18 ఫీట్ల ఎత్తు వరకు వివిధ రూపాల్లోని గణేష్‌ విగ్రహాలను సుమారు 5వేలకు పైగా ప్రతిష్ఠించనున్నారు. దీనికోసం మండపాలను పోటాపోటీగా అలంకరిస్తున్నారు. విద్యుత్‌ దీపాలు, తదితర అలంకరణలు చేస్తున్నారు. నవరాత్రులు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని మండపాలకు అనుమతులు తీసుకోవాలని, జీయో ట్యాగింగ్‌ చేసి భద్రతను పర్యవేక్షిస్తామని పోలీస్‌ అధికారులు నిర్వాహకుల కు సూచిస్తున్నారు. కాగా, గణేష్‌ విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో భువనగిరి, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్‌, గుట్ట, ఆలేరు తదితర మార్కెట్లు, రహదారులు కిక్కిరిశాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పలు ప్రాం తాల్లో మంగళవారం మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి.


మట్టి గణపతులను పూజిద్దాం : కలెక్టర్‌ పమేలా సత్పథి 

పర్యావరణ హితమైన మట్టి గణపయ్యలను పూజించాలని కలెక్టర్‌ పమేలా సత్పథి కోరారు. జిల్లా వెనుకబడిన తరగతు ల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజారు వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొ ని మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివా రీ, టీజీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


వి‘నాయకుల’ ఖర్చు రూ.5.25కోట్లు

మునుగోడు నియోజకవర్గంలో 175 గ్రామాలు

గ్రామానికి ఐదు విగ్రహాలు ఇవ్వనున్న పార్టీలు

ఒక్కో విగ్రహం, నిర్వహణకు రూ.20,000

మునుగోడు, చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 30: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వినాయక చవితి రావడంతో పండుగను అనుకూలంగా మార్చుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. చవితి సందర్భంగా గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు యువకులు అధికంగా ఉత్సాహం చూపుతారు. దీంతో వారితోపాటు ఆ వీధిలో ఉండే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినాయక విగ్రహాలు పంపిణీ చేసేందుకు అన్ని పార్టీలు నిర్ణయించాయి. నియోజకవర్గంలో మొత్తం 175 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఐదు విగ్రహాలు పంపిణీచేసేలా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు నిర్ణయించారు. విగ్రహం, మండపాల అలంకరణ, నవరాత్రుల పాటు పూజల నిర్వహణ, ఇతర ఖర్చులు కలిపి రూ.20వేల వరకు ఇచ్చేలా ఆశావహులు నిర్ణయించారు. ఇలా ఒక్కో పార్టీ 175 గ్రామాలకు 875 విగ్రహాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ లెక్కన మూడు ప్రధాన పార్టీలను తీసుకుంటే 2,625 విగ్రహాలు నియోజకవర్గంలో కొలువుదీరనున్నాయి. అందుకు రూ.20వేల చొప్పున సుమారు రూ.5.25 కోట్లు ఖర్చు కానుంది. ఇదిలా ఉండగా, అధికార పార్టీలో ఇద్దరు నేతలు భారీగా విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశారు. దీంతో ఈ వ్యయం మరింత పెరగనుంది. పార్టీలు పోటా పోటీగా ఖర్చు పెట్టేందుకు ముందుకు రావడంతో యువతలో జోష్‌ నిండగా, పల్లెల్లో పండుగ సందడితోపాటు, ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి సుమారు 20 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో విగ్రహం విలువ సుమారు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఉంటుందని వినికిడి.


మొన్న గోడ గడియారాలు.. నేడు విగ్రహాలు

మనుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు పార్టీలు తాయిలాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఇటీవల గో డ గడియారాలు, గొడుగులు ఇచ్చిన నాయకులు యువతను ఆకర్షించేందుకు వినాయకుడి విగ్రహాల కోసం చందాలు ఇస్తున్నారు. చౌటుప్పల్‌ మండలంలో వినాయకుడి విగ్రహల ప్రతిష్ఠ కోసం టీఆర్‌ఎస్‌ మునుగోడు  నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రూ.10వేల చొప్పున ప్రతీ పండప నిర్వాహకులకు చందా స్వయంగా ఇచ్చారు. లక్కారంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి చందాలు అందజేశారు. మునిసిపాలిటీలో 200 వినాయక విగ్రహాల కోసం, మండల పరిధిలోని గ్రామాల్లో 300 విగ్రహాల కోసం రూ.10వేల చొప్పున చందాలు ఇచ్చారు. వీటిని చౌటుప్పల్‌ వ్యవసాయమార్కెట్‌లో ఇస్తున్నారనే ప్రచారంతో 1,000మందికి పైగా యువకులు  అక్కడికి తరలిరాగా, తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు దీన్ని లక్కా రం ఫంక్షన్‌ హాల్‌కు మార్చారు. అక్కడికి సైతం పెద్ద సంఖ్యలో యువకులు రావడంతో 70 వినాయక విగ్రహాలకు చందాలు ఇచ్చి, మిగతా వాటిని పంపిణీ చేయాల్సిందిగా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు అందజేశారు.


మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలి : మంత్రి

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటుచేయాలని మంత్రి జగదీ్‌షరెడ్డి కోరారు.శ్రీరామ్‌ సేవా ట్రస్ట్‌ స మకూర్చిన మట్టి విగ్రహాలను జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు.కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌,పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయ ణ, నాయకులు బూర బాలసైదులుగౌడ్‌, మారిపెద్ది శ్రీనివా్‌సగౌడ్‌, నర్సింహారావు, ట్రస్ట్‌ ప్రతినిధులు తోట శ్యాం, విజయ్‌, సురేష్‌, అశోక్‌, మనోహర్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివా్‌సపాల్గొన్నారు.


ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి : కలెక్టర్‌

గణేష్‌ నవరాత్రోత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అ న్నారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుతో కలిసి మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - 2022-08-31T06:04:59+05:30 IST