తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం

ABN , First Publish Date - 2022-08-02T05:19:03+05:30 IST

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరమని సామాజిక ఆరోగ్య అధికారి బిచ్చునాయయక్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు.

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం
వెలిశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీహెచ్‌వో బిచ్చునాయక్‌

తిరుమలగిరి రూరల్‌ / సూర్యాపేట టౌన్‌ / సూర్యాపేట (కలెక్ట రేట్‌)/పాలకవీడు / మఠంపల్లి / మునగాల / తుంగతుర్తి,  ఆగస్టు 1 : తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరమని సామాజిక ఆరోగ్య అధికారి బిచ్చునాయయక్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. తిరుమలగిరి మండలం వెలిశాల అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన వారోత్సవంలో ఆయన మాట్లాడారు. కాన్పు అయిన అరగంట లోపు తల్లి ముర్రుపాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. శిశువుకు ఆరు నెలలు వచ్చే వరకు తల్లి పాలు మాత్రమే తాగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వీరయ్య, ఏఎన్‌ఎం వెంకటమ్మ, సూపర్‌వైజర్‌ రామచంద్రు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ జ్యోతి మాట్లాడారు. అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. తల్లిపాల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో పోషణ్‌ అభియాన్‌ జిల్లా సమన్వయకర్త రామునాయక్‌ పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని 48వ వార్డులో జరిగిన కౌన్సిలర్‌ వెలుగు వెంకన్న మాట్లాడారు. హుజూర్‌నగర్‌లోని గోవిందాపురంలో నిర్వహించిన ర్యాలీలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చన మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలకబత్తిని సౌజన్య, బొల్లెద్దు ధనమ్మ, సీడీపీవో విజయలక్ష్మి, హేమాదేవి, తిరపతమ్మ, శాంతారాజ్యం పాల్గొన్నారు. పాలకవీడు మండలం బొత్తపాలెంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. సూపర్‌వైజర్‌ యశోద, టీచర్లు ప్రేమలత, జానకమ్మ, ఏఎన్‌ఎం నాగేంద్ర పాల్గొన్నారు. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, జడ్పీటీసీ బానోతు జగన్‌నాయక్‌, సర్పంచ్‌ విజయలక్ష్మీ, ఎంపీటీసీ నాగిరెడ్డి పాల్గొన్నారు. మునగాల మండలం నేలమర్రిలో సమావేశం నిర్వహించారు.  తుంగతుర్తిలో ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీవో శ్రీజ, సూపర్‌వైజర్‌ ప్రమీల, అంగన్‌వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.Read more