బెల్ట్‌ దుకాణాల్లో బ్రాండెడ్‌ మద్యం

ABN , First Publish Date - 2022-09-27T07:46:10+05:30 IST

త్రిపురారం మండల కేంద్రంలోని మూడు మద్యం దుకాణాల యజమానులు సిండికేట్‌గా మారి బ్రాండెడ్‌ మద్యాన్ని అందుబాటులో లేకుండా చేస్తున్నారు.

బెల్ట్‌ దుకాణాల్లో బ్రాండెడ్‌ మద్యం

 త్రిపురారంలో మద్యం దుకాణాల యజమానులు సిండికేట్‌

 బ్రాండెడ్‌ మద్యం బెల్ట్‌ దుకాణాలకు తరలింపు దందా

త్రిపురారం మండల కేంద్రంలోని  మూడు మద్యం దుకాణాల యజమానులు సిండికేట్‌గా మారి బ్రాండెడ్‌ మద్యాన్ని అందుబాటులో లేకుండా చేస్తున్నారు. వీటిని బెల్ట్‌ షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బెల్ట్‌ దుకాణాల్లో  అధిక ధర చెల్లిస్తే కావల్సిన బాండ్రెడ్‌ మద్యంచేతికి అందుతోంది. మద్యం యజమానుల సిండికేట్‌ దందాతో తమ జేబులకు చిల్లుపడుతోందని మందు బాబులు వాపోతున్నారు. 

– త్రిపురారం

సమీపంలోనే ఉన్న రెండు దుకాణాల యజమానులు ఒక చోట  చైన్‌ దుకాణాలను మద్యం విక్రయించే  కౌంటర్‌ ఏర్పాటు చేసుకుని  కింగ్‌ ఫిషర్‌,  ఐబీ, రాయల్‌ స్టాగ్‌ వంటి విస్కీ బాటిళ్లను  క్వార్టర్‌ నుంచి ఫుల్‌   వరకు రూ.10నుంచి రూ.40వర కు అధికంగా విక్రయిస్తూ యథేచ్చగా దందా సాగిస్తున్నారు. ఈ బాటిళ్లకు ప్రత్యేకంగా ఆర్‌,ఆర్‌,కే అనే కోడ్‌  ఉన్న  స్టిక్కర్లు అతికిస్తున్నారు.  మండలంలోని  ఏ మారుమూల పల్లెలో పల్లెలోనైనా బెల్ట్‌  దుకాణంలో ఈ స్టిక్కర్‌ ఉన్న బాటిళ్లు కాకుండా వేరేవి ఉంటే అధికారులతో తనిఖీలు నిర్వహించి సరుకు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తారని చైన్‌ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. త్రిపురారం మండలానికి అతి సమీపంలో ఉన్న మిర్యాలగూడ పట్టణంలోని అన్ని మద్యం దుకాణాల్లో అన్నిరకాల బ్రాండ్ల మద్యం లభిస్తోంది. త్రిపురారంలో మాత్రం ప్రత్యేకంగా రెండు మూడు రకాల బీరు బ్రాండ్లు మినహా డిమాండ్‌ ఉన్న మద్యం  రకాలను వచ్చినవి వచ్చినట్లుగా బెల్ట్‌ దుకాణాల కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల తిరుమలగిరి (సాగర్‌)లో మద్యం దుకాణాదారులు ప్రత్యేకంగా బాటిళ్లకు స్టిక్కర్లు వేసి బెల్ట్‌ దుకాణాలకు అధిక ధరలు విక్రయిస్తున్నారని అధికారులు కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్‌ చేశారు.  త్రిపురారంలో  మాత్రం మద్యం  దుకాణాలు ప్రారంభమైన నాటి నుంచి ఇష్టారాజ్యంగా యజమానులు వ్యవహరిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడానికి సాహసించడంలేదని, దీనిక కారణం నెలా నెలా సంబంధిత అధికారులకు ముడుతున్న లంచాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఎక్సైజ్‌ అధికారులు స్పందించి  మద్యం వ్యాపారుల  అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

 బ్రాండెడ్‌ మద్య దొరకడం లేదు

త్రిపురారంలో ఏ మద్యం దుకాణం లోనూ అన్ని బ్రాండ్ల మద్యం లభించడం లేదు. బెల్ట్‌  దుకాణాల్లో మాత్రం కావాల్సిన బ్రాండెడ్ల మద్యం అధిక ధర కు దొరుకుతోంది. వ్యాపారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మద్యం దుకాణా లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.

– అనిల్‌కుమార్‌, త్రిపురారం


కేసులు నమోదు చేస్తాం

గిరాకీ ఉన్న  మద్యం బ్రాండ్లు లైసెన్సు ఉన్న దుకాణాల్లో కాకుండా బెల్ట్‌ దుకాణాల్లో  విక్రయిస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు.మద్యం విక్రయాలపై నిఘాపెడతాం.  తనిఖీ లు చేసి నేరం రుజువైతే  మద్యం దుకాణాలను సీజ్‌ చేస్తాం. 

– విజయ్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐ, హాలియా Read more