రైలు కింద పడి ఇద్దరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-07T06:05:08+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

రైలు కింద పడి ఇద్దరి ఆత్మహత్య

భువనగిరి టౌన్‌, జూలై 6: యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లో నివాసముంటున్న గుంటూరు జిల్లా పెనుకొండ మండలం కారుమంచి గ్రామానికి చెందిన మేడకొండ శివప్రసాద్‌(26) బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గరీబ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో లభ్యమైన కాగితాల ఆధారంగా మృతుడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా కరీం నగర్‌ జిల్లా జగిత్యాలకు చెందిన కొమ్మలపల్లి రాంచందర్‌(28) బీబీనగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన రాంచందర్‌ మంగళ వారం అర్ధరాత్రి పగిడిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా రైల్వే పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరూ అవివాహితులే. మృతదేహాలకు భువనగిరి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధు వులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


Read more