ఆడబిడ్డను ఆశీర్వదించండి

ABN , First Publish Date - 2022-10-03T05:53:41+05:30 IST

ఆడబిడ్డగా వచ్చా ఆశీర్వదించాలని మునుగోడు కాంగ్రెస్‌ అభివృద్ధి పాల్వాయి స్రవంతిరెడ్డి అన్నారు. గడపగడప కూ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ఆదివారం మండలంలోని కొరటికల్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఆడబిడ్డను ఆశీర్వదించండి
కొరటికల్‌లో మాజీ ఎంపీపీ మాదిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసి ఓటు అభ్యర్థిస్తున్న స్రవంతి

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

మునుగోడు రూరల్‌, అక్టోబరు 2: ఆడబిడ్డగా వచ్చా ఆశీర్వదించాలని మునుగోడు కాంగ్రెస్‌ అభివృద్ధి పాల్వాయి స్రవంతిరెడ్డి అన్నారు. గడపగడప కూ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ఆదివారం మండలంలోని కొరటికల్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టుపెట్టి మునుగోడు నియోజకవర్గానికి తన తండ్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన సేవలను గుర్తుచేస్తూ ఆయన వారసురాలైన తనకు ఉప ఎన్నికలో ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నన్నూరు విష్ణువర్ధన్‌రెడ్డి, పొ లగోని సైదులు గౌడ్‌, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్‌, పాల్వాయి చెన్నారెడ్డి,మాజీ కోప్షన్‌ సభ్యుడు ఎండీ.అన్వర్‌, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Read more