మతచిచ్చు పెట్టేందుకే బీజేపీ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-04-24T05:48:32+05:30 IST

మతచిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ పాదయాత్ర చేపట్టిందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆరోపించారు.

మతచిచ్చు పెట్టేందుకే బీజేపీ పాదయాత్ర
మహాసభలో మాట్లాడుతున్న నెల్లికంటి సత్యం

మర్రిగూడ, ఏప్రిల్‌ 23: మతచిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ పాదయాత్ర చేపట్టిందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆరోపించారు. శనివారం మం డల కేంద్రంలో నిర్వహించి న పార్టీ మండల మహాస భలో ఆయన మాట్లాడారు. బీజేపీ సాగిస్తున్న పాదయాత్రలు ప్రజలను వంచించడానికి, భారం మోపడానికి సా గుతున్న ప్రచారయాత్ర తప్పా ప్రజలకు ఒరిగేదేమిలేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టాలని అన్నారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతమైన మునుగోడులో సాగు, తాగునీరు అందించే ఎత్తిపోతల పథకం న త్తనడకన నడుస్తుందన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం ప్రా జెక్టుకు ఎక్కడి నుంచి నీరు వస్తుందో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. సీపీఐ కా ర్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి  చేయాలని సూచించారు. మహాసభలో సీపీఐ మండల నాయకులు బూడిద సురేష్‌, చల్లం పాండురంగరావు, అంజాచారి, శ్రీనివాస్‌, మహిళ సమాఖ్య కన్వీనర్‌ రమా, బిక్షంరెడ్డి, శేఖర్‌, రఘుమయ్య పాల్గొన్నారు. 


Read more