రాష్ట్రంలో అధికారం బీజేపీదే: కడియం

ABN , First Publish Date - 2022-10-11T06:05:13+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య అన్నారు.

రాష్ట్రంలో అధికారం బీజేపీదే: కడియం
అన్నారం గ్రామంలో కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్న నాయకులు

తుంగతుర్తి, అక్టోబరు 10: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని  బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య అన్నారు.  సోమవారం మండలంలోని అన్నారం గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్‌ మాజీ చైర్మన్‌ కుంట దయాకర్‌ ఆధ్వర్వంలో 20 కుటుంబాలు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఆయన సమక్షంలో బీజేపీలో చేరాయి. ఈ సంద ర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీలో చేరిన వారిలో అంబటి కృష్ణ, బల్ల హరీష్‌, కుంట వెంకన్న, రాజశేఖర్‌, సోమేష్‌, రవీందర్‌, తదితరులు చేరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, కాప రవి, గాజుల మహేందర్‌, భూతం సాగర్‌ పాల్గొన్నారు.


Read more