బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-10-08T06:18:23+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పాలి
తుమ్మలపల్లిలో ఇంటింటి ప్రచారం చేస్తున్న పాల్వాయి స్రవంతిరెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 

నాంపల్లి, అక్టోబరు 7: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. శుక్రవారం మండలంలోని రెవల్లి, తు మ్మలపల్లి, మహ్మదాపురం, గానుగువెల్లి గ్రామాల్లో పర్యటించి ఆడబిడ్డలకు తిలకం పెట్టి, ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి రూ.20వేల కోట్లకు అమ్ముడుపోయారన్నారు. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి హయాంలోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్‌రెడ్డి, నేర్లకంటి రవి, చాంద్‌పాష, కోరె కిషన్‌, కొమ్ము భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మండలంలోని గానుగువెల్లి గ్రా మంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా, గ్రామానికి చెందిన జల్లాకుల పార్వతమ్మ పై తేనెటీగలు దాడి చేశాయి. గమనించిన స్రవంతి తన సొంత వాహనంలో నల్లగొండ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలికి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు.  

Read more