సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T00:12:00+05:30 IST

పట్టణ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న పలు పనులను మంగళవారం పరిశీలించి సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు.

సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి
పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, నవంబరు 29: పట్టణ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న పలు పనులను మంగళవారం పరిశీలించి సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎన్జీ కళాశాల వద్ద బాబూ జగ్జీవన్‌రాం కాంస్య విగ్రహంతోపాటు సుందరీకరణ, గడియారం వద్ద రోడ్డు వెడల్పు, సుభాష్‌ విగ్రహం వద్ద, పెద్దబండ, కలెక్టర్‌ కార్యాలయం వద్ద జంక్షన్‌లో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహ ఏర్పాటు, డీఈవో కార్యాలయం వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. సాగర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద జంక్షన్‌ అభివృద్ధి తదితర పనులను త్వరగా పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, కమిషనర్‌ రమణాచారి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, ఫ్లోర్‌ లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్‌, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్‌యాదవ్‌, బోయనపల్లి శ్రీనివాస్‌, గోగుల శ్రీను, యామ కవిత దయాకర్‌, బషీరుద్దీన్‌, వట్టిపల్లి శ్రీను, దండంపల్లి సత్తయ్య, గంజి రాజేందర్‌, మునిసిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:12:00+05:30 IST

Read more