సోషల్‌ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-04-24T05:52:50+05:30 IST

సోషల్‌ మీడియాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ సై బర్‌ నేరాల విశ్లేషకు డు వెంకటరమణారా వు అన్నారు.

సోషల్‌ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణారావు

నల్లగొండ, ఏప్రిల్‌ 23: సోషల్‌ మీడియాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ సై బర్‌ నేరాల విశ్లేషకు డు వెంకటరమణారా వు అన్నారు. శనివారం ఎంజీయూలో నిర్వహించిన అవగాహ న సదస్సులో ఆయన మాట్లాడారు. సోషల్‌ మీడియాలో ఫొటోలను అప్‌లోడ్‌ చేయవద్దని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన నెంబర్లు, మెసేజ్‌లను చూడవద్దని, ఓటీపీని ఇతరులకు ఇవ్వవద్దని అన్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే వాటికి స్పందించవద్దని, లాటరీ వచ్చిందని ఆశపెట్టినా నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాన్ని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ ప్రశాంతి, పీఆర్వో శశిధర్‌ పాల్గొన్నారు. 

Read more