తల్లిదండ్రులతో బాధ్యతగా మెలగాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2022-06-07T06:53:08+05:30 IST

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో పిల్లలు బాధ్యతగా మెలగాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారితో మాట్లాడారు. ఫిర్యాదుదారుల ఆర్జీలపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులతో బాధ్యతగా మెలగాలి: ఎస్పీ
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటక్రైం, జూన్‌ 6 : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో పిల్లలు బాధ్యతగా మెలగాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారితో మాట్లాడారు. ఫిర్యాదుదారుల ఆర్జీలపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది పిల్లలు వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల పోషణను పట్టించుకోవడం లేదన్నారు. ఆస్తులను తీసుకుని వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరైనా తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో 13ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. 

Read more