అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-07-05T06:00:19+05:30 IST

అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పవద్దన్నారు.

అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించి మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటక్రైం, జూలై 4: అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పవద్దన్నారు. ఇంటర్‌నెట్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, మెయిల్స్‌కు వ్యక్తిగత ఓటీపీ వివరాలు చెప్పవద్దని సూచించా రు. వాటి ఆధారంగా సైబర్‌ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. సైబర్‌ మోసాలపై 1930 జాతీయ టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల ఫిర్యాదులపై సంబంధి త అధికారులు వెంటనే స్పందించాలని ఎస్పీ ఆదేశించారు.


Updated Date - 2022-07-05T06:00:19+05:30 IST