ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-12-02T02:13:22+05:30 IST

ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రేపాల శ్రీనివా స్‌ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం పురస్కరించుకుని గురువారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తృత్వ పోటీల సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఎయిడ్స్‌పై  అప్రమత్తంగా ఉండాలి

ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా ర్యాలీలు

కోదాడ టౌన్‌, డిసెంబరు 1: ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రేపాల శ్రీనివా స్‌ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం పురస్కరించుకుని గురువారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తృత్వ పోటీల సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వేముల వెంకటే శ్వర్లు, జి.శ్రీనివాస్‌, పి.జ్యోత్స్న, దేవమణి, లక్ష్మీనారాయణ, గురవయ్య, వాసు, యాదగిరి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రమౌళి, రత్నకుమారి, లలిత, రమేష్‌, శర్మ, తిరుమల, చంద్రశేఖర్‌, సైదులు, సుజాత, జ్యోతి, వీరయ్య పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి

హుజూర్‌నగర్‌: ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలని హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి హెచ్‌ఐవీ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌చార్జి విజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం హరికృష్ణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బ్లడ్‌ గ్రూప్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సాయి, సిద్దు, తండు హరికృష్ణగౌడ్‌, అనిల్‌, శేఖర్‌, అజ్మత్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఇన్‌చార్జి జక్కుల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T02:13:25+05:30 IST