డాక్టర్‌ పుల్లారావుకు అవార్డు

ABN , First Publish Date - 2022-09-12T05:16:45+05:30 IST

జిల్లా కేంద్రానికి చెందిన ప్ర ముఖ ప్రభుత్వ కంటి వైద్య నిపుణులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్‌ ఏసీహెచ పుల్లారావుకు అసోసియేషన ఆఫ్‌ కమ్యూనిటీ ఆఫ్‌ ఇండియా అవార్డు దక్కిం ది.

డాక్టర్‌ పుల్లారావుకు అవార్డు
అవార్డు అందుకుంటున్న డాక్టర్‌ పుల్లారావు

నల్లగొండఅర్బన, సెప్టెంబరు 11: జిల్లా కేంద్రానికి చెందిన ప్ర ముఖ ప్రభుత్వ కంటి వైద్య నిపుణులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్‌ ఏసీహెచ పుల్లారావుకు అసోసియేషన ఆఫ్‌ కమ్యూనిటీ ఆఫ్‌ ఇండియా అవార్డు దక్కిం ది. తెలంగాణ రాష్ట్రం నుంచి గుర్తింపు పొందిన ముగ్గురు వైద్యుల్లో డాక్టర్‌ పుల్లారావు ఒకరు. ఆయన కంటి వైద్యంలో చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డు ప్ర దానం చేశారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో ప్రహల్‌గామ్‌లో జరిగిన ఆప్తమాలజి స్ట్‌ అసోసియేషన సమావేశంలో చైర్మన డిస్ట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ డాక్టర్‌ ఎండీ యూసుఫ్‌ కోవర్సి, డాక్టర్‌ లోకేష్‌ ఓం మధారియా, డాక్టర్‌ సయ్యద్‌ తారిఖ్‌ ఖురేషిల నుంచి అవార్డును అందుకున్నారు. డాక్టర్‌ పుల్లారావు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కంటి సంరక్షణ కోసం, కంటి జబ్బుల, అంధత్వ నివారణ కోసం విశేషం గా కృషి చేయడమే కాకుండా కంటి అవయవదానంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పుల్లారావు మాట్లాడుతూ ఐ ఎంఏ నీలగిరి డాక్టర్ల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని పే ర్కొన్నారు. ఈ అవార్డు స్ఫూర్తితో ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. అవార్డు పొందడంపై ఐఎంఏ నీలగిరి డాక్టర్లు పీవీఎన మూర్తి, అనితారాణి, రమేష్‌, జయప్రకా్‌షరెడ్డి, శ్రీనివా్‌సరావు అభినందించారు.  


Read more