యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలు అనుమతించాలి

ABN , First Publish Date - 2022-06-11T06:41:14+05:30 IST

యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను అనుమతించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ డిమాండ్‌ చేశారు.

యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలు అనుమతించాలి
యాదగిరిగుట్ట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆటోకార్మికులు, సీపీఎం నాయకులు

 ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట సీపీఎం  ఆందోళన

భువనగిరి రూరల్‌, జూన 10: యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను అనుమతించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ డిమాండ్‌ చేశారు. సీపీఎం  ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కొండపైకి ఆటోలను నిషేధించడంతో గత 30సంవత్సరాలుగా యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి రాకపోకలు సాగిస్తూ ప్రయాణికుల అవసరాలను తీరుస్తూ, తమ కుటుంబాలను పోషించుకుంటున్న దాదాపు 300 కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  76రోజులుగా ఆటో కార్మికులు వినూత్న నిరసనలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ, బందెల ఎల్లయ్య, అన్నంపట్ల కృష్ణ, వెంకటేశ, అంజయ్య పాల్గొన్నారు. 

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను తక్షణమే అనుమతించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మంగ నర్సింహులు,  పార్టీ మండల అధ్యక్షుడు బబ్బూరి పోశెట్టి డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుమందు గుట్ట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ రాముకు అందజేశారు. కార్యక్రమంలో అటో యూనియన్‌ నాయకులు ఎస్‌.ఎ మన్సూర్‌పాషా, బాకీ మొగులయ్య, నాగరాజు, దేవేందర్‌గౌడ్‌, గుండు సాయిలు పాల్గొన్నారు.

 ఆలేరు:  మండల కేంద్రంలో ఉపతహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రెడ్డికి  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ.ఇక్బాల్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మొరిగాడి రమేష్‌, మహేష్‌ నల్లమాస తులసయ్య, జూకంటి పౌల్‌, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, గణగాని రాజు, భాస్కర్‌, సధానందం పాల్గొన్నారు. 

తుర్కపల్లి: తహసీల్దార్‌కు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం సీఐటీయూ నాయకులతో కలిసి ఆటో కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్‌, నాయకులు కొక్కొండ లింగ య్య, సీఐటీయూ ఆటో యూనియన అధ్యక్షుడు బోయిన సత్తయ్య ఉన్నారు.  

Read more