ప్రైవేట్‌ క్లినిక్‌లపై దాడులు

ABN , First Publish Date - 2022-10-02T06:00:33+05:30 IST

జిల్లాలోని పలు ప్రైవేట్‌ క్లినిక్‌లపై జిల్లా వైద్య శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు.

ప్రైవేట్‌ క్లినిక్‌లపై దాడులు
నేరేడుచర్లలో అర్హత లేని ఆస్పత్రికి నోటీసు ఇస్తున్న జిల్లా వైద్యశాఖ అధికారులు

అనుమతులులేని క్లినిక్‌లు సీజ్‌ 

డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌)/ గరిడేపల్లి/ మునగాల/ నేరేడుచర్ల/ తిరుమలగిరి, అక్టోబ రు 1: జిల్లాలోని పలు ప్రైవేట్‌ క్లినిక్‌లపై జిల్లా వైద్య శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అనుమతులు లేని క్లినిక్‌లను సీజ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల ను డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ హర్షవర్థన్‌ తనిఖీ చేశారు. నిబంధనలు సరిగాలేని వారికి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వహకులు విధిగా అనుమతులు తీసుకోవాలన్నారు. వైద్యుల పేర్లు ఆస్పత్రి నోటీసు బోర్డుల్లో ఉంచాలన్నా రు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే డాక్టర్లు డ్యూటీ సమయాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించకూదన్నారు. ఆస్పత్రులకు విధిగా రిజిస్ర్టేషన్‌ ఉండాలని, ఆస్పత్రుల్లో రికార్డు ల నిర్వాహణ ఉండాలన్నారు. అనుమతులులేని సాయిడెంటల్‌ ల్యాబ్‌ పరికరాలను సీజ్‌ చేశా రు. కార్యక్రమంలో డిప్యూటీ డెమోలు శ్రీనివాసులు, నర్సయ్య, మనోజ్‌, రమేష్‌, ఠాగూర్‌, బిచ్చునాయక్‌ ఉన్నారు. గరిడేపల్లిలోని పలు ప్రైవేట్‌ క్లీనిక్‌లపై ప్రత్యేక అధికారి డాక్టర్‌ కళ్యాణ చక్రవ ర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. శివసాయి ఫస్ట్‌ ఎయిడ్‌ సెం టర్‌, కార్తికేయ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లను సీజ్‌చేశారు. తనిఖీ బృందాలను చూసి పలు ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్ల యజమానులు క్లినిక్‌లకు తాళాలు వే సుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి జగదీశ్వర్‌, ప్రత్యేక అధికారులు భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, అం జయ్య, జగదీష్‌ పాల్గొన్నారు. మునగాలలో అనుమతులు లేని క్లినిక్‌లపై జిల్లా వైద్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్‌ షాపులను అడ్డాగా చేసుకొని నడుపుతున్న రెం డు క్లినిక్‌లను సీజ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు గ్రామీణ వైద్యులు క్లీనిక్‌లను మూసివేశారు. జిల్లా వైద్యాధికారులు శ్రీరాజు, కిరణ్‌ మాట్లాడుతూ అనుమతులు లేకుండా క్లినిక్‌లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేరేడుచర్లలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జిల్లా వైద్య బృందం అధికారి డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో తనిఖీ లు నిర్వహించారు. పట్టణంలో ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న వెంకట శివ ఆసుపత్రి, కోటయ్య ఆసుపత్రి, ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లు, అర్హతలేని టెక్నీషియన్లు నడిపిస్తున్న వెంకటేశ్వర ల్యాబ్‌, సౌకర్యాలు లేని స్నేహ ల్యాబ్‌లను సీజ్‌ చేశామని తెలిపారు. వైద్య అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొందరు క్లినిక్‌లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. కార్యక్రమంలో నేరేడుచర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ నాగయ్య, ప్రత్యేకాధికారులు భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, అంజయ్య, జగదీష్‌ ఉన్నారు. తిరుమలగిరిలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌, అధికారులతో కలిసి దాడులు చేస్తున్నారన్న సమాచారం తెలిసిన కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. అధికారులు అలా వెళ్లగానే, షరా మామూలుగానే మళ్లీ తెరిచారు. 

Read more