కేసీఆర్‌ పిలుపుతోనే ఎంపీ అరవింద్‌పై దాడులు

ABN , First Publish Date - 2022-01-28T06:09:16+05:30 IST

: కేసీఆర్‌ గతంలో ఇచ్చిన పిలుపుతోనే నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేశాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఎంపీ అర వింద్‌ దాడికి నిరసనగా జిల్లాలో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడులు సరికాదన్నారు.

కేసీఆర్‌ పిలుపుతోనే ఎంపీ అరవింద్‌పై దాడులు
తిరుమలగిరిలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

కోదాడ  రూరల్‌ / తిరుమలగిరి / నేరేడుచర్ల / హుజూర్‌ నగర్‌, జనవరి 27 :  కేసీఆర్‌ గతంలో ఇచ్చిన పిలుపుతోనే నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేశాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఎంపీ అర వింద్‌ దాడికి నిరసనగా జిల్లాలో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడులు సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదన్నారు. ప్రతిపక్షాలపై దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు. దాడికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు. దాడిని ఖండిస్తూ కోదాడలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నకిరేకంటి జగన్మోహన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌, సీనియర్‌ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్‌, నకిరేకంటి జగన్మోహన్‌రావు, పట్టణ ఉపాధ్యక్షుడు, సురేష్‌ పాల్గొన్నారు.


Read more