బాకీ డబ్బులు అడిగినందుకు గొడ్డలితో దాడి

ABN , First Publish Date - 2022-07-07T06:03:02+05:30 IST

డబ్బుల విషయంలో జరిగిన గొడవలో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో బుధవారం జరిగింది.

బాకీ డబ్బులు అడిగినందుకు గొడ్డలితో దాడి

సూర్యాపేట జిల్లాలో ఘటన 

సూర్యాపేటరూరల్‌, జూలై 6: డబ్బుల విషయంలో జరిగిన గొడవలో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో బుధవారం జరిగింది. ఏఎస్‌ఐ వెంకట్‌రాములు తెలిపిన వివరాల ప్రకారం... కాసరబాద గ్రామానికి చెందిన కొమిరిశెట్టి శ్రవణ్‌ అదే గ్రామానికి చెందిన బంటు శ్రీనుకు గతంలో డెయిరీ ఫామ్‌ నిర్వహిస్తుండగా రూ.2లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ లావాదేవీల విషయంలో పలు మార్లు పంచాయితీలు కూడా జరిగాయి ఈ క్రమంలో బుధవారం బంటు శ్రీను సోషల్‌ మీడియాలో గతంలో ఇరువురు మాట్లాడిన ఆడియోను పోస్ట్‌ చేశాడు. దీంతో శ్రవణ్‌ శ్రీను ఇంటి దగ్గరకు వెళ్లి ‘నీను ఇచ్చిన డబ్బులు ఇవ్వగా పోగా నాపై సోషల్‌ మీడియాలో ఎందుకు పోస్ట్‌ చేస్తున్నావు’ అని అడిగాడు. దీంతో మాట మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పది మందిలో నన్ను డబ్బులు అడుగుతున్నాడని కోపం పెంచుకున్న శ్రీను అతని ఇంట్లో ఉన్న గొడ్డలితో దాడి చేయగా శ్రవణ్‌ తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకట్‌రాములు తెలిపారు. 

Read more