సమైక్యత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2022-09-13T05:38:53+05:30 IST
నల్లగొండ నియోజకవర్గకేంద్రంలో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించను న్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పా ట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

నల్లగొండ, సెప్టెంబరు 12: నల్లగొండ నియోజకవర్గకేంద్రంలో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించను న్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పా ట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్, విద్యాశాఖ అధికారులతో ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 15రోజుల పాటు నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడకలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరో మూడు రోజుల పాటు నిర్వహించనున్న భారత సమైక్యత వజ్రోత్సవాలనూ విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 16న నియోజకవర్గ కేంద్రం లో 15వేల మందితో ర్యాలీ నిర్వహించాలన్నారు. హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్ నుం చి ఎన్జీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కళాశాలలో సమావేశాలు జరుగుతాయని తెలిపారు. సెప్టెంబరు 17వ తేదీన అతిథులతో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో జగన్నాథరావు, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఈవో భిక్షపతి, జిల్లా రవాణా అధికారి సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిండి ఎత్తిపోతల భూ నిర్వాసితులకు పునరావాసం, ఆర్అండ్ఆర్ వేగవంతం చేయాలి
దేవరకొండ : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూనిర్వాసితుల కు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. దేవరకొండ ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం సందర్శించా రు. చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితుల వివరాలు, ఆర్అండ్ఆర్ ప్రక్రియ వివరాలను దేవరకొండ ఆర్డీవో గోపిరాంను అడిగి తెలుసుకున్నారు. నక్కలగండి, పెండ్లిపాకల ప్రాజెక్టు ఎత్తుపెంపుతో భూములు కోల్పోతు న్న నిర్వాసితుల వివరాలను తెలుసుకున్నారు.