ఆర్మీ ర్యాలీకి పకడ్బందీగా ఏర్పాట్లు : ఎస్పీ

ABN , First Publish Date - 2022-10-08T06:15:46+05:30 IST

జిల్లా కేంద్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఆర్మీ ర్యాలీకి పకడ్బందీగా ఏర్పాట్లు : ఎస్పీ
జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటఅర్బన్‌, అక్టోబరు 7 : జిల్లా కేంద్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆర్మీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్మీ ర్యాలీకి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి యువత హాజరవుతారన్నారు. ఇందుకోసం ర్యాలీ నిర్వహించే ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధం గా ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారికి ప్రథమ చికిత్స అందించేందుకు వైద్యసిబ్బందితో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామని వివరించారు. అలాగే తాగునీటి వసతిని కల్పించడంతో పాటు మైదానాన్ని అన్నివిధాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయన వెంట కల్నల్‌ కె.దాస్‌, మేజర్‌ తరుణ్‌జిత్‌, సుబేదార్‌ మేజర్‌ శివాజీలాల్‌జాట్‌, దీపక్‌రావత్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌,  డీఎస్పీ పరిక నాగభూషణం, మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, ఆర్టీవో వెంకటరెడ్డి, ఫోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ పెండెం వెంకటరమణ, ఆర్‌అండ్‌బీ ఈఈ యాకుబ్‌, వీవీనాయుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి వెంకటేశం తదితరులు ఉన్నారు.


Read more