రైతు వ్యతిరేక విధానాలను సహించం

ABN , First Publish Date - 2022-11-25T00:55:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సహించే ప్రసక్తే లేదని నల్లగొండ డీసీసీ అఽధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.

రైతు వ్యతిరేక విధానాలను సహించం
దామరచర్లలో జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌ వర్క్‌)

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సహించే ప్రసక్తే లేదని నల్లగొండ డీసీసీ అఽధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దామరచర్లలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతుల పాలిట ధరణి పోర్టల్‌ శాపంగా మారిందన్నారు. భూ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. మిర్యాలగూడలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మాట్లాడారు. మర్రిగూడ, హాలియా, పెద్దవూర, అడవి దేవులపల్లి, పెద్దవూర, వేములపల్లి, నిడమనూరు మండల కేంద్రాల్లో కాం గ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేశారు. మునుగోడు తహసీల్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత, రాష్ట్ర నాయకుడు చలమల కృష్ణారెడ్డి మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. శాలిగౌరారంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా, రాస్తారోకోలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్‌ మాట్లాడారు. ధర ణి వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయని వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నేరేడుగొమ్ము తహసీల్దార్‌ కార్యాలయంలో నాయకులు వినతి పత్రం అందజేశారు. కొండమల్లేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ మాట్లాడారు. పోడు భూముల రైతులకు పట్టాలు అందజేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల న్నారు. పెద్దఅడిశర్లపల్లి, తిరుమలగిరి(సాగర్‌), చింతపల్లిలో నిరసన తెలిపారు. తిప్పర్తిలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్‌ పాల్గొన్నారు. అన్ని మండలాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - 2022-11-25T00:55:57+05:30 IST