ఆశల పల్లకిలో అన్నదాత

ABN , First Publish Date - 2022-01-03T06:46:15+05:30 IST

యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.

ఆశల పల్లకిలో అన్నదాత
కనగల్‌లో వరి నారుతీస్తున్న కూలీలు

 యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. పీఏపల్లి మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో రైతులు నారుపోసి, పొలాలు సిద్ధం చేస్తున్నారు. కనగల్‌ మండలంలో సైతం రైతులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వరి నారును సిద్ధం చేసుకున్న రైతులు నాట్లను ముమ్మరం చేశారు. మండల వ్యాప్తంగా గత సీజన్‌లో 28వేల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం అంతే మొత్తంలో వరిసాగయ్యే అవకాశం ఉంది.

- కనగల్‌, పెద్దఅడిశర్లపల్లి

Read more