టైరు పేలి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో

ABN , First Publish Date - 2022-09-13T05:44:15+05:30 IST

ఆటో టైరు పేలి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడం తో ఐదుగురికి గాయాలయ్యాయి.

టైరు పేలి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో

ఐదుగురికి గాయాలు

దేవరకొండ, సెప్టెంబరు 12:  ఆటో టైరు పేలి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడం తో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం మైనంపల్లి బిడ్ర్జి సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మం డలంలోని టి.గౌరారం నుంచి ప్రయాణికులతో ఆటో దేవరకొండకు వస్తుండగా మై నంపల్లి బిడ్ర్జి సమీపంలోకి రాగానే ఆటో ముందు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో  ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రై వర్‌ దామోదర్‌, రఘుపతిరావు, జ్యోతిలకు గాయాలయ్యాయి. బైక్‌పై ఉన్న నేరేడుగొ మ్ము మండలానికి చెందిన తుల్చా, జబ్బార్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చి కిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి సం బంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవరకొండ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. 


Read more