ఘనంగా అంబాభవానీ జాతర

ABN , First Publish Date - 2022-10-05T06:09:17+05:30 IST

నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ అంబా భవా నీ జాతరను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అంబాభవానీ జాతర
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

 ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు 

నేరేడుగొమ్ము, అక్టోబరు 4: నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ అంబా భవా నీ జాతరను ఘనంగా నిర్వహించారు.  దసరాను పురస్కరించుకొ ని వేలాది మంది భ క్తులు మంగళవారం మొక్కులు తీర్చుకున్నా రు. గిరిజనులు ఆరాధ్యదైవంగా అంబాభవానిని కొలుస్తారు. కోరిన కోర్కెలు నె రవేర్చే దైవంగా అం బాభవానికి పేరుగాంచింది. దీంతో దేవరకొండ నియోజకవర్గంతో పాటు నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, మాచర్ల, హైదరాబాద్‌ పట్టణాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ర మావత రవీంద్రకుమార్‌, గిరిజన కార్పొరేషన చైర్మన రాంచందర్‌నాయక్‌ దం పతులు, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌, నేరేడుగొమ్ము ఎంపీపీ బానావత ప ద్మహనుమానాయక్‌, జడ్పీటీసీ బాలు, సర్పంచ పంబాల అంజయ్య, ఎంపీటీసీ యుగేందర్‌రెడ్డి, ఆలయ పూజారి జీవనప్రసాద్‌, వైస్‌ఎంపీపీ ఆరేకంటి ముత్యాలమ్మ రాములు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణ, వివిధ పా ర్టీల నాయకులు, భక్తులు పాల్గొని పూజలు చేశారు.  


Read more