కోర్టు భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు

ABN , First Publish Date - 2022-09-10T06:50:58+05:30 IST

తుంగతుర్తి మండల కేంద్రంలో జూనియర్‌ సివిల్‌ కోర్టు భవనం నిర్మాణానికి సర్వే నెం.199లో 3ఎకరాల10 గుంటలు స్థలాన్ని కేటాయించారు. భూమి అడ్వాన్స్‌ పొజిషన్‌ పత్రాలను సివిల్‌ జడ్జి సురేష్‌కుమార్‌ సమక్షంలో కోర్టు సూపరింటెండెంట్‌ భవానికి తహసీల్దార్‌ రాం ప్రసాద్‌ అందచేశారు.

కోర్టు భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు
జడ్జి సురేష్‌కుమార్‌ సమక్షంలో భూమిపత్రాలను అందచేస్తున్న రెవెన్యూ అధికారులు

తుంగతుర్తి, సెప్టెంబరు 9: తుంగతుర్తి మండల కేంద్రంలో జూనియర్‌ సివిల్‌ కోర్టు భవనం నిర్మాణానికి సర్వే నెం.199లో 3ఎకరాల10 గుంటలు స్థలాన్ని కేటాయించారు.  భూమి అడ్వాన్స్‌ పొజిషన్‌ పత్రాలను సివిల్‌ జడ్జి సురేష్‌కుమార్‌ సమక్షంలో కోర్టు సూపరింటెండెంట్‌ భవానికి తహసీల్దార్‌  రాం ప్రసాద్‌ అందచేశారు. కార్యక్రమంలో బార్‌  అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌, రాజారాం, సతీష్‌, ప్రతాప్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.


Read more