అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-10T00:56:15+05:30 IST

జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారి రవికిరణ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించా రు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కళాశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి రవికిరణ్‌

రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారి రవికిరణ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 9: జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారి రవికిరణ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించా రు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కళాశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. సదరం వివరాల ఆధారంగా దివ్యాంగ ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హులై ఉండి ఓటరుగా నమోదు కాకపోతే వెంటనే వారిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితాలోని తప్పులను సరిచే యాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, వెంకారెడ్డి, కిశోర్‌కుమార్‌, తహసీల్దార్లు వెంకన్న, రమణారెడ్డి, శేషగిరిరావు, జయశ్రీ, కార్తీక్‌, శ్రీనివాసశర్మ, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:56:16+05:30 IST