కల్తీ మద్యం సీసాలు సీజ్‌

ABN , First Publish Date - 2022-09-19T06:38:06+05:30 IST

మండల కేంద్రంలో శ్రీసాయి మద్యం దుకాణంలో కల్తీ మద్యం సీసాలను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆదివారం సీజ్‌ చేశారు.

కల్తీ మద్యం సీసాలు సీజ్‌

అనంతగిరి, సెప్టెంబరు 18: మండల కేంద్రంలో శ్రీసాయి మద్యం దుకాణంలో కల్తీ మద్యం సీసాలను రాష్ట్ర  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు  ఆదివారం  సీజ్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో శ్రీసాయి మద్యం దుకా ణంలో రాష్ట్ర ట్రాస్క్‌ఫోర్స్‌ అధికారులు సోదాలు నిర్వహించి 10సిగ్నిచర్స్‌ 180ఎంఎల్‌ మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారని తెలిపారు. ఈ విషయంపై ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మిని  వివరణ కోరగా శ్రీసాయి మద్యం దుకాణంలో  ట్రాన్స్‌ఫోర్స్‌ అధికారులు సోదాలు చేసి మద్యం బాటిళ్ల సీజ్‌ చేశారనానరు. ఈ నివేదికను ఉన్నతా ధికారులకు  పంపి చర్యలు తీసుకుంటామన్నారు. 

విషయం బయటికి పొక్కకుండా..

 సాయి మద్యం దుకాణంలో ఉదయం ఎనిమిది గంటలకు సోదాలు నిర్వహించి కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు  ఈ విషయం బయట పొట్టకుండా వ్యవహరించారు.  కల్తీ మద్యం సీజ్‌ చేసిన విషయం బయటకు పొక్కటంతో సంబంధిత ఎక్సైజ్‌ అధికారి స్టేషన్‌కు రాలేదు. మండలంలో కల్తీ మద్యం పలు దుకాణాల్లో ఉండవచ్చని  ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యాన్ని ఏ విధంగా కల్తీ చేశారు? ఎక్కడి నుంచి కల్తీ మద్యం సరఫరా అయింది? ఏఏ ప్రాంతాల్లో తర లించారు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అఽధికారులు తెలిపారు. 


Read more