రికార్డులు సక్రమంగా లేకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-07-18T06:48:31+05:30 IST

జాతీయ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులకు తగిన రికార్డులు చూపించకపోతే చర్యలు తీసుకుంటామని ఉపాధిహామీ కేంద్ర తనిఖీ డైరెక్టర్‌ ఆర్‌పీ సింగ్‌ హెచ్చరించారు.

రికార్డులు సక్రమంగా లేకుంటే చర్యలు
కర్కాయలగూడెంలో ఉపాధిహామీ పథకం పనులను కొలుస్తున్న కేంద్ర తనిఖీ బృందం

మోతె, జులై 17: జాతీయ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులకు  తగిన రికార్డులు చూపించకపోతే చర్యలు తీసుకుంటామని ఉపాధిహామీ కేంద్ర తనిఖీ డైరెక్టర్‌ ఆర్‌పీ సింగ్‌ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని కర్కాయలగూడెం, తుమ్మగూడెం గ్రామాల్లో  జిల్లా అధికారులతో కలిసి ఉపాధి పథకంలో చేపట్టిన పనులను, రికార్డులను పరిశీలించాలరు. కర్కాయలగూడెంలో చేపట్టిన 13 రకాల పనులు వర్మి కంపోస్టు, శ్మశానవాటిక, అంతర్గత సీసీ రోడ్లు, చెరువుల్లో పూడికతీత వంటి పనులు రికార్డుల ప్రకారం పనులు జరిగాయా? లేదా అనే అంశంపై పనుల వద్ద కొలతలు, మస్టర్లు తనిఖీలు చేశారు. పలు పనులకు సంబంధించిన రికార్డులను అధికారులు అందజేయకపోవడంతో  ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల్లో ఉన్న ప్రకారం కొలతలు లేని పనుల వివరాలను సేకరించారు. తుమ్మగూడెంలో చేపట్టిన ఎనిమిద రకాల పనులకు , గుట్ట మీద నుంచి కాలువల నిర్మాణ పనుల కొలతలను తీసుకున్నారు. శ్మశాన వాటిక సీసీ రోడ్ల వివరాల బోర్డులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచా యితీ కార్యాలయంలో ‘ఉపాధి్‌లో చేపట్టిన ఏడు రకాల పనుల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర తనిఖీ అధికారులు అంకిత శర్మ, అరుణ్‌ పటేల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌, జడ్పీ సీఈవో సురేష్‌, పీడీ కిరణ్‌కుమార్‌, అడిషనల్‌ పీడీ పెంటయ్య, ఆర్డీవో రాజేంద్రప్రసాద్‌, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, ఎంపీవో హరిసింగ్‌, సర్పంచ్‌లు నర్సిరెడ్డి, యుగేంధర్‌రెడ్డి, ఏపీవో నగేష్‌, ఈసీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. Read more