ఉపాధి కల్పించకపోతే చర్యలు

ABN , First Publish Date - 2022-04-24T05:37:22+05:30 IST

ప్రతీ గ్రామపంచాయతీలో 100మంది కూలీలకు తగ్గకుండా ఉపాధిహామీ పని కల్పించాలని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు.

ఉపాధి కల్పించకపోతే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి

గుర్రంపోడు, ఏప్రిల్‌ 23: ప్రతీ గ్రామపంచాయతీలో 100మంది కూలీలకు తగ్గకుండా ఉపాధిహామీ పని కల్పించాలని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు. మండలకేంద్రంలోని మండలపరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శనివారం సమావేశం నిర్వహించారు. 100మంది కూలీల కంటే తక్కువగా పని కల్పించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలన్నారు. పనిచేసే ప్రదేశం వద్ద నీటివసతి కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీపాద సుధాకర్‌, ఎంపీవో బైరెడ్డి మల్లిఖార్జున్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Read more