బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

ABN , First Publish Date - 2022-09-29T06:15:37+05:30 IST

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో సిరికొండ నవీన్‌కుమార్‌ తెలిపారు

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
విలేకరులతో మాట్లాడుతున్న ఈవో

చెర్వుగట్టు ఈవో సిరికొండ నవీన్‌ 

నార్కట్‌పల్లి, సెప్టెంబరు 28: బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో సిరికొండ నవీన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం గుట్టపై ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుదారులు పేర్కొన్న 12అంశాలకు సంబంధించిన పూర్తి రికార్డులను విచారణాధికారి.. వరంగల్‌జోన్‌ డీసీ శ్రీకాంత్‌రావుకు అందజేశామన్నారు. భక్తుల ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వ చ్చిన విచారణాధికారుల బృందానికి పూర్తిగా సహకరించామన్నారు. నివేదిక మేరకు కమిషనర్‌ నుంచి వచ్చే ఆదేశాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పసునూరి శ్రీనివాస్‌, ప్రభాకర్‌రెడ్డి, మేక వెంకట్‌రెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.  

Read more