పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-05T05:56:26+05:30 IST

పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన నకరకంటి సోమమ్మ కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేటక్రైం, జూలై 4 : పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన నకరకంటి సోమమ్మ కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ చివ్వెంల మండం తుల్జారావుపేట గ్రామ శివారులోని తన 2.6 ఎకరాల భూమిలో 40 ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్నానని తెలిపారు. గతేడాది కొంతమంది తన భూమిన కబ్జా చేయగా కలెక్టర్‌ ఫిర్యాదు చేశానని, తహసీల్దార్‌ను పంచనామాలో తన భూమిగా తేలిందన్నారు. అయితే వారం కిందట పెసర పంటనుసాగు చేయగా కొంతమంది పంటను నాశనం చేయడంతో పాటు అడ్డు వచ్చిన తనపై దాడికి ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Read more