ఎపీటోం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-18T06:11:59+05:30 IST

తమ కుటుంబసభ్యులపై పెట్టిన అక్రమ కేసులు ఏత్తివేయాలని, తమపై దౌర్జన్యం చేసిన ఎపీటోం యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతుల కుటుంబ సభ్యులు మిద్దెల మంజుల, కలమ్మ, రేణుక, సంద్య, ప్రశాంతి, రంగయ్య, బీఎస్పీ నాయకుడు పల్లె లింగస్వామి డిమాండ్‌ చేశారు.

ఎపీటోం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
చౌటుప్పల్‌ రూరల్‌: పోలీస్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బాధిత రైతు కుటుంబ సభ్యులు

పోలీస్‌ స్టేషన ఎదుట బాధిత రైతుల ధర్నా

చౌటుప్పల్‌ రూరల్‌ జూలై 17: తమ కుటుంబసభ్యులపై పెట్టిన అక్రమ కేసులు ఏత్తివేయాలని, తమపై దౌర్జన్యం చేసిన ఎపీటోం యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతుల కుటుంబ సభ్యులు మిద్దెల మంజుల, కలమ్మ, రేణుక, సంద్య, ప్రశాంతి, రంగయ్య, బీఎస్పీ నాయకుడు పల్లె లింగస్వామి డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌ పోలీసు స్టేషన ఎదుట ఏపీటోం బాధిత రైతు కుటుంబసభ్యులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగడపల్లి రెవెన్యూ పరిధిలో తమ కుటుంబానికి చెందిన రెండు ఎకరాల 10 గుంటల భూమిని ఎపీటోం సంస్థ అక్రమించుకుందని, ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 14న తమ భూమిలో సేద్యం చేయడానికి వెళితే సెక్యూరిటీ సిబ్బంది  దాడి చేశారని ఆరోపించారు. దాడి విషయంపై ప్రశ్నించడానికి కార్యాలయానికి వెళితే దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేస్తే తమ కుటుంబసభ్యులపై మాత్రమే పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, తమ కుటుంబసభ్యులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. తమపై దాడులు చేసిన యజమాన్యం, సిబ్బందిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తమ కుటుంబసభ్యులపై పెట్టిన అక్రమ కేసులు ఏత్తివేయాలని, యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం సీఐకి వినతి పత్రం అందజేశారు.  

బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీ నాయకులు: బాధిత రైతులు

భువనగిరి రూరల్‌: బీజేపీ నాయకులు పోలీసుల ప్రోద్బలంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత రైతులు ఆరోపించారు. ఈమేరకు స్థానిక రూరల్‌ పోలీస్‌ స్టేషన ఎదుట ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ భువనగిరి మండలం బస్వాపురంలో సర్వే నెంబర్‌ 207లో తమ తాతల నుంచి వంశపార్యంపరంగా వచ్చిన భూమిని సాగు చేస్తుండగా, తమ పలుకుబడితో 100నెంబర్‌కు డయల్‌ చేసి పనులను నిలిపివేశారని సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌ గౌడ్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతులు ఆర్‌.మల్లేశ, ఆర్‌.బాలస్వామి, రామస్వామి, మహేందర్‌, నర్సింహ, రమేశ, పెంటయ్య ఉన్నారు. 


Read more