కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-02-23T05:50:55+05:30 IST

హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బస్వాపురం రిజర్వాయర్‌ వద్ద రైతులు మం గళవారం ధర్నా నిర్వహించారు.

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
బస్వాపురం రిజర్వాయర్‌ వద్ద ధర్నా చేస్తున్న రైతులు

బస్వాపురం రిజర్వాయర్‌ వద్ద రైతుల ధర్నా

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 22: హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బస్వాపురం రిజర్వాయర్‌ వద్ద రైతులు మం గళవారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ కారణంగా సర్వే నెంబర్‌ 229లో 100మంది రైతులు 99ఎకరాల భూమిని కోల్పోతున్నారన్నారు. తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుని జీవిస్తున్నామని, అసైన్డ్‌ భూముల సాకుతో ఎలాంటి పరిహా రం చెల్లించకుండా కాంట్రాక్టర్‌ పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, ప్రాజెక్టు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని హైకోర్ట్‌ స్టేట్‌సకో ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ధిక్కరించి కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ కె.సైదులు అక్కడి కి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించా రు. ధర్నాలో భూనిర్వాసితులు ఉడుత విష్ణు, మచ్చ తిరుపతి, ముసునూరి వెంకటేశం, వెంకటనర్సు, చంద్రయ్య, కొమురయ్య, రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T05:50:55+05:30 IST