భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే

ABN , First Publish Date - 2022-09-12T04:43:50+05:30 IST

భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే కృషి ఫలితంగానే భూదానోద్యమానికి పోచంపల్లిలో బీజం పడిందని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌ అన్నారు.

భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే
వినోబాభావే విగ్రహానికి పూలమాల వేస్తున్న లింగస్వామియాదవ్‌

భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబరు 11: భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే కృషి ఫలితంగానే భూదానోద్యమానికి పోచంపల్లిలో బీజం పడిందని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌ అన్నారు. పట్టణంలోని భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే 128వ జయంతిని వినోబాసేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. భూదానోద్యమానికి నాంది పలికిన ఆచార్య వినోబాభావే స్మృతి చిహ్నంగా ఇక్కడ వినోబామందిరం నిర్మితమైందన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన పోచంపల్లి నేడు ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా, సిల్కుసిటీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిందన్నారు. భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డిల సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో గాంధీగ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర నాయకుడు ఏలె భిక్షపతి, వినోబాసేవాసంఘం నాయకులు కొయ్యడ నర్సింహగౌడ్‌, వేశాల మురళి, గునిగంటి మల్లేష్‌గౌడ్‌, సార బాలయ్యగౌడ్‌, అండాలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-12T04:43:50+05:30 IST