‘పింఛన్లను తొలగించడం అన్యాయం’

ABN , First Publish Date - 2022-10-11T06:00:56+05:30 IST

ప్రభుత్వం పింఛన్లు ఇచ్చి పలు కారణా లతో తొలగించడం అన్యాయమని కాంగ్రెస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏపూరి సుధీర్‌ అన్నారు.

‘పింఛన్లను తొలగించడం అన్యాయం’

నడిగూడెం, అక్టోబరు 10: ప్రభుత్వం పింఛన్లు ఇచ్చి పలు కారణా లతో తొలగించడం అన్యాయమని కాంగ్రెస్‌ పార్టీ  మండల ప్రధాన కార్యదర్శి ఏపూరి సుధీర్‌ అన్నారు. పింఛన్లను తొలగించిన బాధితులతో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట  సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు  చేసిందని, కుటుంబంలో ప్రభుత్వ పింఛన్‌దారులు, కారు ఉందనే కారణంతో పింఛన్లను ప్రభుత్వం ఇటీవల తొలగించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎం.ఎర్రయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పిచ్చయ్య, ఇస్మాయిల్‌, చిలకమ్మ, వెంకన్న పాల్గొన్నారు. 


Read more