ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-12T05:20:56+05:30 IST

ప్రేమ విఫలమై ఓ యు వకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలంలోని పార్లపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
మహేష్‌ మృతదేహం

గుర్రంపోడు, సెప్టెంబరు 11:  ప్రేమ విఫలమై ఓ యు వకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలంలోని పార్లపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్థులు, ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపిన వి వరాల ప్రకారం.... కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రా మానికి చెందిన మేడబోయిన మహేష్‌ (18) గుర్రంపోడు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన అక్కనబోయిన వెంక టయ్య వద్ద సంవత్సరం నుంచి వ్యవసాయ పనులు చేస్తున్నా డు. మహేష్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు సమాచారం. తనకు ప్రేమ దక్కదేమోననే భయంతో మహేష్‌ తను పనిచే సే రైతు వెంకటయ్య బత్తాయి తోటలో క్రిమసంహారక మందు తాగి అపస్మారక స్థితి లో పడిపోయాడు. గమనించిన వెంకటయ్య దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు. ప్రే మ విఫలమే ఆత్మహత్యకు కారణమని ఎస్‌ఐ తెలిపారు. 


Read more