వాగులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-11-12T01:02:54+05:30 IST

మండలంలోని పాలేరు వాగులో పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..

వాగులో పడి వ్యక్తి మృతి

అనంతగిరి, నవంబరు 11: మండలంలోని పాలేరు వాగులో పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని లకారం గ్రామానికి చెందిన కంకణాల నాగయ్య(60) ఈనెల తొమ్మిదో తేదీన గేదెలు మేపడానికి గ్రామ శివారుకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగిరాలేదు. పాలేరు వాగు వద్ద కుమారుడు కంకణాల గోపాలరావు వెదకగా వాగు ఒడ్డున తండ్రి చెప్పులు కనిపించాయి. దీంతో కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గజ ఈతగాళ్లతో వాగులో గాలించారు. వాగు నీటిలో శుక్రవారం మధ్యాహ్నం నాగయ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనం తరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.

Updated Date - 2022-11-12T01:02:54+05:30 IST

Read more