నూతన వంతెన నిర్మించాలి : సీపీఎం

ABN , First Publish Date - 2022-10-12T06:25:11+05:30 IST

భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి నాగిరె డ్డిపల్లి వద్ద ఇటీవల వర్షాలతో ధ్వంసమైనందున నూతన వంతెన నిర్మించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

నూతన వంతెన నిర్మించాలి : సీపీఎం
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

భువనగిరి రూరల్‌, అక్టోబరు 11: భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి నాగిరె డ్డిపల్లి వద్ద ఇటీవల వర్షాలతో ధ్వంసమైనందున నూతన వంతెన నిర్మించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. ధ్వంసమైన కల్వర్టు వద్ద పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ధ్వంసమైన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు కొన సాగిస్తున్నాయని, ఇటీవల ఆ బ్రిడ్జి వద్ద ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నా రు. ఇప్పటికైనా కల్వర్టు ఎత్తు, వెడల్పు పెంచాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, దయ్యాల నర్సింహ, ఎదునూరి మల్లేశం, ముత్యాలు, వెంకటేశ్‌, అంజిరెడ్డి, యాదగిరి, మల్లేశ్‌, పాండు, సిద్దిరాజు, లాలయ్య పాల్గొన్నారు. 


Read more