ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-09-29T06:20:23+05:30 IST

శాలిగౌరారం మండలం మాదారం(కలాన) జడ్పీహెచఎ్‌స 1988-89 పదవ తరగతి బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళ నం బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులు

నకిరేకల్‌, శాలిగౌరారం, సెప్టెంబరు 28: శాలిగౌరారం మండలం మాదారం(కలాన) జడ్పీహెచఎ్‌స 1988-89 పదవ తరగతి బ్యాచకు చెందిన  పూర్వ విద్యార్థుల సమ్మేళ నం బుధవారం ఘనంగా నిర్వహించారు. నకిరేకల్‌లోని కమల్‌గార్డెన్సలో పూర్వ విద్యార్థులు సకుటుంబ సమ్మేళనాన్ని నిర్వహించు కొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 33ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థులు ఒకేచోట కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటి ఉపాధ్యాయులను ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో మాదారం, ఇటుకులపహాడ్‌, పెర్కకొండా రం, వంగమర్తి, ఓగోడు, ఊట్కూరు, చిత్తలూరు గ్రామాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 


Read more