ధాన్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలి

ABN , First Publish Date - 2022-11-25T01:34:42+05:30 IST

జిల్లాలో జరిగిన ధాన్యం కుంభకోణంపై సీబీఐ/సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.

ధాన్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట సిటి, నవంబరు 24: జిల్లాలో జరిగిన ధాన్యం కుంభకోణంపై సీబీఐ/సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం ఆక్రమాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. వారి కన్నుసన్నల్లో అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో చోటుచేసుకున్న ధాన్యం ఆక్రమాలపై నివేదికను టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఽజిల్లా కేంద్రంలో ఆర్డీవోగా పనిచేసిన మోహన్‌రావుకు సొంత జిల్లాలోనే అదనపు కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వడం సిగ్గుచేట న్నారు. మూసీ వాగులో ఉన్న ఇసుకను ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ మాయం చేస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జెల వెంకటరెడ్డి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, చల్లమళ్ల నరసింహ, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్‌, మీర్‌అక్బర్‌, వల్దాస్‌ ఉపేందర్‌, గార్లపాటి మమతరెడ్డి, కర్నాటి కిషన్‌, కొండేటి ఏడు కొండలు, బిట్టు నాగరాజు, సలీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:34:42+05:30 IST

Read more