మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

ABN , First Publish Date - 2022-07-18T06:08:55+05:30 IST

మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆదివారం తిప్ప ర్తి పోలీ్‌సస్టేషనలో కేసు నమోదైంది.

మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

తిప్పర్తి, జూలై 17: మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆదివారం తిప్ప ర్తి పోలీ్‌సస్టేషనలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మహిళ మల్లెపల్లివారిగూడెంలోని తూటుపల్లి శ్రీను అనే వ్యక్తికి చెందిన మడిగ(గది) కిరాయికి తీసుకొని రెండేళ్లుగా ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ (క్లినిక్‌) నిర్వహిస్తుంది. రెండు రోజుల క్రితం శుక్రవారం రాత్రి శ్రీను క్లినిక్‌ వద్దకు వచ్చి తనతో దురుసుగా మాట్లాడి కులం పేరుతో దూషించాడని సదరు మహిళ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. మాడ్గులపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శ్రీనుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏఎ్‌సఐ మట్టయ్య తెలిపారు. 


Read more