ఉమ్మడి జిల్లాలో 19లక్షల మంది ఫ్లోరైడ్‌ బాధితులు

ABN , First Publish Date - 2022-12-09T00:46:25+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19లక్షల మం ది ఫ్లోరైడ్‌ బాధితులు ఉన్నారని ఉస్మానియా యూనివర్శిటీ జువాలజీ డిపార్ట్మ్‌ంట్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. జితేందర్‌కుమార్‌ తెలిపారు. ‘

ఉమ్మడి జిల్లాలో 19లక్షల మంది ఫ్లోరైడ్‌ బాధితులు
సమావేశంలో మాట్లాడుతున్న ఓయూ ప్రొఫెసర్‌ జితేందర్‌

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జితేందర్‌

నార్కట్‌పల్లి, డిసెంబరు 8: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19లక్షల మం ది ఫ్లోరైడ్‌ బాధితులు ఉన్నారని ఉస్మానియా యూనివర్శిటీ జువాలజీ డిపార్ట్మ్‌ంట్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. జితేందర్‌కుమార్‌ తెలిపారు. ‘.బయోకెమికల్‌, సైటో జెనిటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఇన్‌ ఎండమిక్‌ ఫ్లోరైడ్‌ ఆఫ్‌ నల్లగొండ జిల్లా’ అనే అంశంపై రీసెర్చీలో భాగంగా నార్కట్‌పల్లి మండలంలోని దాసరిగూడెంలో గురువారం ఫ్లోరైడ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా 22మిలియన్ల మంది ఫ్లోరిన్‌ బారిన పడ్డారని, మరో 22 మిలియన్ల మంది ఫ్లోరిన్‌ సంక్రమణ బాధితులు కానున్నారన్నారు. ఫ్లోరిన్‌ నివారణలో నిర్లక్ష్యం వహిస్తే భవిషత్‌లో ఆందోళన కలిగించే వ్యాధిగా మారుతుందని హెచ్చరించారు తెలంగాణలో అత్యధికంగా ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలుగా గుర్తించిన నార్కట్‌పల్లి మండలంలోని దాసరిగూడెం, చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెంలతో పాటు ఫ్లోరైడ్‌ తక్కువగా నమోదైన మిర్లోనిగూడెం, మోటుబావిగూడెం, బట్టపోతులగూడెంలను ఎంపిక చేసుకుని నీటి నమూనాలను సేకరించి పరిశోధన చేశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 0.5 పీపీఎం మోతాదుకు మించి నార్కట్‌పల్లి మండలంలోనిపై మూడు గ్రామాల్లో ఫ్లోరిన్‌ ఎక్కువగా ఉందన్నారు. ఈ నీటిని సేవించడం ద్వారా మానవ శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్న భూతం దేహంలోని కణాలతో కలిసి ప్రమాదకర స్థాయి మార్పులను కలగజేస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,108 ఆవాస గ్రామాల్లో సుమారు 19లక్షల మంది ఫ్లోరోసిస్‌ బాధితులున్నట్లు తమ పరిఽశోధనలో తేలిందన్నారు. ఫ్లోరిన్‌ పట్ల ఏ మాత్రం ని ర్లక్ష్యం తగదని అప్రమత్తంగా లేకుంటే ఆందోళన పడాల్సి వస్తుందన్నారు. నీటిని కాచి చల్లార్చి తాగితే ఫ్లోరిన్‌ శాతం కొంత తగ్గే అవకాశం ఉందని సూ చించారు. సురక్షిత నీరు, సంతులన ఆహారం తీసుకోవాలని ఇంకుడు గుంతలను తీసుకుని నిల్వ చేసిన వర్షపు నీటిని సేవించడం ఆరోగ్యానికి మంచిదన్నారు. కాగా ఫ్లోరోసిస్‌ బారిన పడిన బాధితులను పరిశీలించారు. ఈ సమావేశంలో ఫ్లోరైడ్‌ పరిశీలన జిల్లా అధికారి వీరారెడ్డి, సర్పంచ్‌ ఉప్పల అనంతలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు. ఓయూకు చెందిన పరిశోధక విద్యార్థి చిరబోయిన లక్ష్మయ్య ఫ్లోరిన్‌పై చేస్తున్న పరిశోధనకు ప్రొఫెసర్‌ జితేందర్‌ గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-12-09T00:46:29+05:30 IST