పట్టణంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2022-10-01T05:19:11+05:30 IST

పట్టణంలో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు.

పట్టణంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు
సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డి

మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి 

రామగిరి, సెప్టెంబరు 30: పట్టణంలో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, పానగల్‌ బైపాస్‌ వద్ద ఫ్లైఓవర్‌ పనులు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు, పాతబస్తీలో  రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా మర్రిగూడ బైపాస్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రి య కూడా పూర్తయిందని తెలిపారు. క్లాక్‌టవర్‌ వద్ద కళాభారతి, ఐటీ హబ్‌ వంటి పనులకు సుమారు రూ.1000 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలిపారు. దీంతో పాటు విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా త్వరలో చేపడతామన్నారు. కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ మొబైల్‌ టాయిలెట్ల కోసం గతం లో కొనుగోలు చేసిన బస్సు ఎటు పోయిందని ప్రశ్నించారు. మళ్లీ కొ నాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. బడ్జెట్‌ను చూసి ఖర్చు చేయాలి కానీ హంగు ఆర్భాటాలకు పోతే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా పింఛనదారులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులను కోరారు. బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ మాట్లాడుతూ పట్టణంలో కొన్ని గృహాలకు ఆస్తిపన్ను మూడింతల స్థాయి లో వేశారని, వాటిని సరిచేయమని కోరితే నెలల సమయం ఎందు కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సమావేశంలో మునిసిపల్‌ క మిషనర్‌ కేవీ రమణాచారి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అలీ, వైస్‌చైర్మన అబ్బగోని రమేష్‌, అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Read more